- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫస్ట్ టైమ్ అసెంబ్లీలో మాట్లాడిన ఆదినారాయణ.. ప్రభుత్వం దృష్టికి కీలక సమస్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టును డెవలప్ చేయాలని ఎమ్మెల్యే జారే ఆది నారాయణ కోరారు. మూడు నెలల కిందట భారీ వర్షాలతో ఆ ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు. వేల ఎకరాల పంట వరద నీటిలో కొట్టుకుపోయిందన్నారు. ఆ సమయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు విజిట్ చేసి తాత్కాలికంగా రింగ్ బండ్ ఏర్పాటుకు చొరవ తీసుకున్నారన్నారు. కానీ శాశ్వత మరమ్మత్తులు చేయించి రైతులను ఆదుకోవాలన్నారు. దాదాపు 13 వేల ఎకరాలు ఈ ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నదన్నారు. మంగళవారం ఆయన ఫస్ట్ టైమ్ అసెంబ్లీలో మాట్లాడారు. చండ్రుగొండ మండలంలోని జలగం వెంగళరావు ప్రాజెక్టును కూడా రిపేర్ చేయించాలన్నారు. గడిచిన ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టు ధ్వంసం అయిందన్నారు.
ఎన్నికల కంటే ముందు ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు తనను గెలిపిస్తామని అక్కడి రైతులు హామీ ఇచ్చారని, అందుకు జలగం వెంగళరావు ప్రాజెక్టును రిపేర్ చేయించాలని అభ్యర్ధించినట్లు గుర్తు చేశారు. అప్రోచ్ క్యానల్స్ పూర్తిగా నాశనం అయ్యాయని వివరించారు. ఇప్పటికే ఎస్టిమేషన్ వేసి ఇరిగేషన్ మంత్రికి వివరాలు అందజేశానని, ఆయన ఆ శాఖ ఉన్నతాధికారులకూ పంపించారన్నారు. కానీ ఆ ప్రతిపాదన తిరస్కరించారని వెల్లడించారు. అత్యధిక రైతులు ఆధారపడిన ఈ ప్రాజెక్టును వెంటనే రిపేర్ చేయించేందుకు కృషి చేయాలని కోరారు. ఇక ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టును కూడా అభివృద్ధి చేయాలని రిక్వెస్ట్ చేశారు. మరోవైపు అశ్వారావు పేట కు దాదాపు 45 కి.మీ దూరంలో ఉన్న ఆదివాసీ ప్రాంతం కావడిగుండ్లకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఇక తనను గెలిపించిన అశ్వారావు పేట్ నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, లీడర్లకు ధన్యవాదాలు తెలిపారు.