ఏఈపై అధికార పార్టీ ఎంపీపీ భర్త దురుసు ప్రవర్తన (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-01 15:10:59.0  )
ఏఈపై అధికార పార్టీ ఎంపీపీ భర్త దురుసు ప్రవర్తన (వీడియో)
X

దిశ, మానకొండూర్: అధికార పార్టీ ఎంపీపీ భర్త తీరు వివాదాస్పదమైంది. ప్రభుత్వ అధికారిపై దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. మానకొండూర్ ఎంపీపీ ముద్దసాని సులోచన, భర్త శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ రాజ్ ఏఈ‌పై దురుసుగా ప్రవర్తించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ భర్త ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి పంచాయితీ రాజ్ ఏ‌ఈ పై నీళ్ల బాటిల్‌తో దాడి చేస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. వెల్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన భూమి పూజ కార్యక్రమానికి సమయం కేటాయించడం లేదని ఆగ్రహంతో ఏఈ పై నీళ్ల బాటిల్ విసిరారు. ఈ ఘటనతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Advertisement

Next Story