- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kishan Reddy : కిషన్ రెడ్డి రిక్వెస్ట్‌కు రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో రైలు ఆపాలంటూ దీర్ఘకాలంగా ప్రజలు చేస్తున్న డిమాండ్లపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్‌ను కలిసి రిక్వెస్ట్ చేశారు. కిషన్ రెడ్డి రిక్వెస్ట్‌కు రైల్వే మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. ఆయా స్టేషన్లలో వివిధ ముఖ్యమైన రైళ్లను ఆపడం ద్వారా ప్రజలకు కలిగే సౌకర్యం గురించి వివరించారు. దీనిపై అధికారులతో మాట్లాడిన రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్.. తాజాగా డిమాండ్లకు అంగీకరిస్తూ.. ఆయా రైల్వేస్టేషన్లలో వివిధ ప్రధానమైన రైళ్లను ఆపనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఆగనున్న రైల్వే స్టేషన్‌లు:
తెలంగాణలో బెల్లంపల్లి, సిర్పూర్-కాగజ్‌నగర్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, గద్వాల్ రైల్వే స్టేషన్లలో ఆగనుండగా.. ఆంధ్రపదేశ్‌లో పిడుగురాళ్ల, నడికుడి, సత్తెనపల్లి, డోర్నకల్, బొబ్బిలి, దువ్వాడ, పీలేరు స్టేషన్లలో వివిధ రైళ్లను ఆపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
- Tags
- kishan reddy