బ్రేకింగ్: ఢిల్లీకి బయలుదేరిన మహిళా మంత్రులు.. కేబినెట్ భేటీ మధ్యలోనే హస్తినకు పయనం!

by Satheesh |   ( Updated:2023-03-09 13:15:44.0  )

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మహిళా మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో గురువారం కేబినెట్ సమావేశం జరుగుతుండగానే మీటింగ్ మధ్యలోనే మంత్రులు ఢిల్లీకి పయనమయ్యారు. అయితే, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళ రిజర్వేషన్ల కోసం చేపట్టనున్న దీక్షలో పాల్గొనేందుకే ఢిల్లీ వెళ్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.

మంత్రి మండలి సమావేశం మధ్యలోనే మంత్రులు హుటాహుటిన హస్తినా బాట పట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీ కవితకు మద్దుతుగా దీక్షలో పాల్గొనేందుకు వెళ్లాలని సీఎం ఆదేశించడంతోనే మహిళా మంత్రులు ఢిల్లీ బాట పట్టినట్లు సమాచారం. ఇక, మహిళా రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేపు దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story