ఉపాధ్యాయులకు శుభవార్త.. మంత్రి కీలక హామీ

by samatah |   ( Updated:2022-11-24 12:01:59.0  )
ఉపాధ్యాయులకు శుభవార్త.. మంత్రి కీలక హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉపాధ్యాయులకు సంబంధించి పీఎఫ్, రుణాలు, మెడికల్ బిల్లుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వత చంద్రశేఖర్ రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇతర ఉపాధ్యాయులతో కలిసి మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి బొత్స దృష్టి తీసుకెళ్లారు. ఉపాధ్యాయుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చినట్లు తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వత చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

Next Story