ఇక మీ కరెంట్ బిల్లు మీరే చెల్లించండి.. మంత్రులు, అధికారులకు సీఎం షాక్

by Prasad Jukanti |   ( Updated:2024-06-17 11:28:17.0  )
ఇక మీ కరెంట్ బిల్లు మీరే చెల్లించండి.. మంత్రులు, అధికారులకు సీఎం షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కీలక స్థానంలోని ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులకు మన దేశంలో ప్రభుత్వం తరపున రకరకాల మినహాయింపులు లభిస్తాయి. వీరికి జీతభత్యాలు ఇస్తున్నప్పటికీ ప్రజలు చెల్లించే టాక్స్ సొమ్ములో నుంచి అదనపు రాయితీలు కల్పిస్తుంటారు. ఈ తరహా వీఐపీ కల్చర్ పై చాలా కాలంగా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు తమ విద్యుత్ బిల్లులు సొంత డబ్బులతో చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జూలై నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపారు. ఈనిర్ణయం వల్ల విద్యుత్ బోర్డుకు వచ్చే నష్టాలను నివారించవచ్చని తత్ఫలితంగా విద్యుత్ చార్జీలను పెంచాల్సిన అవసరం తప్పుతుందన్నారు. తొలుత నేను, సీఎస్ వచ్చే నెల విద్యుత్ బిల్లులను మేమే చెల్లించుకుంటామనిప్రకటించారు.వీఐపీ కల్చర్ కు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర సెక్రటేరియట్ కాంప్లెక్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు స్వాగతిస్తున్నారు.

Advertisement

Next Story