మంత్రి ఉత్తమ్‌కి సోయి తప్పింది.. మాజీమంత్రి హరీష్ రావు ఫైర్

by Ramesh Goud |
మంత్రి ఉత్తమ్‌కి సోయి తప్పింది.. మాజీమంత్రి హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద (SLBC Tunnel Incident) ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సోయి తప్పి మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ (Congress) కి ఒక నీతి, బీఆర్ఎస్ (BRS) కి ఒక నీతా అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) అన్నారు. ఎస్ఎల్‌బీసీ ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. దురదృష్టకరమైన సంఘటన జరిగి ఎనిమిది మంది ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వారిని కాపాడేది వదిలి, మంత్రి ఉత్తమ్ తనను తాను కాపాడుకోవడానికి గత ప్రభుత్వం (Previous Government)పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి సోయి తప్పి మాట్లాడుతున్నాడని, మంత్రిగా రికార్డులు ఆయన వద్దే ఉన్నాయి చూసుకోవాలని హితవు పలికారు. టన్నెల్ లో చిక్కుకున్న 8 మందిని కాపాడే ప్రయత్నం చేయకుండా గత ప్రభుత్వం అని రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. అలాగే 2005 లో ఎస్ఎల్బీసీ నిర్మాణం ప్రారంభం అయితే, 2005 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఖర్చు 3,300 కోట్లు మాత్రమేనని, 2015 నుండి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఖర్చు 3,900 కోట్లు అని చెప్పారు. బీఆర్ఎస్ హయంలో 900 కోట్లు ఎక్కవే ఖర్చు చేశామని అన్నారు. పదేళ్ల కాలంలో రెండెళ్లు కరోనా (Corona) వచ్చి పనులు ఆగిపోయాయని, మిగిలిన సమయంలో 13 కిలోమీటర్ల టన్నెల్ తాము తవ్వామని, బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీ పనులు చేయలేదు అనడం అబద్ధమని చెప్పారు.

కాళేశ్వరం (Kaleshwaram) 3 ఏండ్లలో చేసినప్పుడు SLBC ఎందుకు చేయలేము? అని, ఎస్ఎల్బీసీ అనేది ఒక తప్పుడు ఆలోచన అని, కాంగ్రెస్ ఎటు కాకుండా ఇరికించింది అని కేసీఆర్ (KCR) ఆనాడే అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ కూలితే బీఆర్ఎస్ తప్పు అన్నారని, ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే ప్రకృతి వైపరిత్యం అంటున్నారని, ఇదెక్కడి నీతి? అని నిలదీశారు. అంత పెద్ద కాళేశ్వరంలో ఒక పిల్లర్ కూలితే మా తప్పా.. టన్నెల్ కూలితే మీ తప్పు కాదా అంటూ, మీకు ఒక నీతి.. మాకు ఒక నీతా..? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story