- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Uttam: కేసీఆర్ పక్కా డెకాయిట్‌లా వ్యవహరించారు: మంత్రి ఉత్తమ్ ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రానున్న నాలుగున్నరేళ్లలో తెలంగాణ ముఖచిత్రం మారుస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా లూఠీ చేసిందని ఫైర్ అయ్యారు. ఇరిగేష్ శాఖను అడ్డం పెట్టుకుని కేసీఆర్ పక్కా డెకాయిట్‌లా వ్యవహరించారని ఆరోపించారు. ప్రారంభించి ప్రతి ప్రాజెక్టులోనూ రూ.వేల కోట్ల స్కామ్‌లు చేశారని మండిపడ్డారు. వివిధ ప్రైవేటు నిర్మాణ సంస్థలకు రూ.14 వేల కోట్లకు పైగా బిల్లులను పెండింగ్ పెట్టారని ధ్వజమెత్తారు. రైతులకు సాగునీరందించాలనే సాకుతో కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టులు నిర్మించారని.. అందులోనూ కాళేశ్వరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారని ఆక్షేపించారు. 2026 మార్చి లోపు ఎలాగైనా దేవాదుల ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని.. తెలంగాణ కలను సాకారం చేసిన సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.