Minister Tummala: రుణమాఫీ వేళ రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచన

by Gantepaka Srikanth |
Minister Tummala: రుణమాఫీ వేళ రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీ రెండో విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం.. రూ.6,191 కోట్ల నిధులను అసెంబ్లీ వేదికగా మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక సూచనలు చేశారు. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన రుణమాఫీ సభలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలో ఐదు లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ పంటలు వేయాలని రైతులకు సూచించారు. అనేక రాష్ట్రాలకు పామాయిల్ సరఫరా చేసే స్థాయికి మనం చేరాలని పిలుపునిచ్చారు. మన్మోహన్ సింగ్ హయాంలో ఒకేసారి రూ.70 వేల రుణమాఫీ చేశామని.. ఒకే పంట కాలంలో ఏకంగా రూ.31 వేల కోట్లు మాఫీ చేసినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వమని అన్నారు. పంటలబీమా ద్వారా రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గతంలో కంటే భిన్నంగా రైతుభరోసా విధివిధానాలు ఉంటాయని చెప్పారు. ఆయిల్‌పామ్ పంట వేయాలని రైతులను కోరారు.

Advertisement

Next Story

Most Viewed