- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎమ్మెల్యేగా గెలవలేకపోయాం.. ఎంపీ సీటు గెలిచి తీరాలి: మంత్రి తుమ్మల
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానాన్ని మళ్ళీ మనమే గెలవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌లు ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ నేతలతో మీటింగ్ నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, కంటెస్టడ్ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ విజయమే లక్ష్యంగా ఎలా పనిచేయాలనే విషయాలపై చర్చించారు. అన్ని విధాలుగా తన పూర్తి సహకారం ఉంటుందని తుమ్మల హామీ ఇచ్చారు. స్థానికంగా ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవాలని, అందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
Advertisement
Next Story