- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Minister Thummala: నా మాటల్లో తప్పుంటే.. శిక్షించండి: మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) ఏర్పాటు రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతలు మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. తమ విజ్ఞప్తితోనే రాష్ట్రానికి పసుపు బోర్డు వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala Nageshwar Rao) అనడం చాలా విడ్డూరంగా ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) ఇటీవలే కామెంట్ చేశారు. అయితే, ఆయన చేసిన కామెంట్స్‌కు తాజాగా మంత్రి తుమ్మల (Minister Thummala) కౌంటర్ ఇచ్చారు.
ఇవాళ ఖమ్మం (Khammam)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరానని తుమ్మల అన్నారు. తమ విజ్ఞప్తిని మన్నించి ప్రధాని రాష్ట్రానికి పసుపు బోర్డును మంజూరు చేశారని కామెంట్ చేశారు. తెలంగాణ లక్షలాది రైతులకు మేలు జరిగింది కాబట్టే.. తాను ప్రధాని నరేంద్ర మోడీకి (Prime Minister Modi)కి ధన్యవాదాలు చెప్పానని అన్నారు. ఒకవేళ తన మాటల్లో ఏమైనా తప్పు ఉంటే ఎంపీ అర్వింద్ (MP Arvind) తనను శిక్షించవచ్చని కౌంటర్ ఇచ్చారు. అతడు ఒక పార్లమెంట్ సభ్యుడు (Member of Parliament) కాబట్టి తాను మర్యాద ఇచ్చి మాట్లాడానని.. కానీ, ఇతరులకు ఆయన గౌరవం ఇవ్వడం.. ఇవ్వకపోవడం ఆయన ఇష్టమని మంత్రి తుమ్మల అన్నారు.