- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Thummala: ఢిల్లీ పరిస్థితులు తెచ్చుకోవద్దు.. మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలి: మంత్రి తుమ్మల
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీలో ఆక్సిజన్ కేంద్రాలు వెలుస్తున్నాయని, మన రాష్ట్రంలో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. గురువారం ఆయన నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన 16వ గ్రాండ్ నర్సరీ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నీళ్లు మాత్రమే కొనుకుంటున్నామని, భవిష్యత్తులో గాలి కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో ఇప్పటికే సెంటర్లు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయని తెలిపారు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంట్లో మొక్కలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రూఫ్ గార్డెన్, వర్టికల్ గార్డెన్స్ తదితర విధానాల్లో ఇంటి నిండా మొక్కలు పెంచుకోవాలన్నారు.
Minister Thummala: ఢిల్లీ పరిస్థితులు తెచ్చుకోవద్దు.. మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలి: మంత్రి తుమ్మలహార్టీకల్చర్ డైరెక్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున రూఫ్ గార్డెన్స్ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ శాఖ నుంచి కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఈ నర్సరీ మేళాలో అందమైన పూలమొక్కలు రూ.50 నుంచి రూ.3 లక్షల ఖరీదు వరకు ఉన్నాయని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొవాలని పిలుపునిచ్చారు. హార్టీకల్చర్, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పిస్తామన్నారు. హార్టీకల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. ఈ నర్సరీ మేళాలో కిచెన్ గార్డెన్, ఆర్ణమెంటల్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్, చెట్లను పెంచడానికి కావాల్సిన వస్తువులు లభిస్తున్నాయని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 150 స్టాల్స్రావడం సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేళా ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.