Minister Thummala: రుణమాఫీపై సీఎం మాటను నిలబెట్టుకున్నారు: మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-08-15 16:23:23.0  )
Minister Thummala: రుణమాఫీపై సీఎం మాటను నిలబెట్టుకున్నారు: మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి మాట నిలుపుకున్నారని తెలిపారు. గత ఐదేళ్లుగా ప్రాజెక్ట్ పనులు ఏమాత్రం ముందుకు సాగలేదని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టుకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇతర శాఖల నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందని తెలిపారు. ఇక్కడ లిఫ్ పెడితే కోదాడకు కూడా గోదావరి జలాలను తీసుకెళ్లొచ్చని అన్నారు. అదేవిధంగా ప్రాజెక్ట్‌కు సంబంధించి మేజర్ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉందని మంత్రి తుమ్మల తెలిపారు.

Advertisement

Next Story