సింగిల్ విండో పాలసీతో టూరిజం అభివృద్ధి.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Vinod kumar |
సింగిల్ విండో పాలసీతో టూరిజం అభివృద్ధి.. మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగిల్ విండో పాలసీతో రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామని, మైస్ టూరిజం(మీటింగ్స్ ఇన్సెంటీవ్స్ కన్వెన్షన్స్ ఎగ్జిబిషన్స్) క్యాపిటల్ గా హైదరాబాద్ పేరొందిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ సిటీ, ఐటీ, హోటల్, ఫార్మా, మెడికల్ టూరిజం హబ్ గా ఇప్పటికే పేరు సాధించిందన్నారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో టూరిజం ప్రమోషన్ ను నిర్వహించేందుకు హెచ్సీవీబీ( హైదరాబాద్ కన్వెన్షన్ విజిటర్స్ బ్యూరో) జనరల్ బాడీ సమావేశంను మంగళవారం టూరిజం ప్లాజాలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో టూరిజం ప్రమోషన్ ను నిర్వహిస్తున్నామన్నారు.

మైస్ టూరిజంలో దుబాయ్, ప్యారిస్, లండన్, మేల్ బోర్న్, సిడ్ని, న్యూయార్క్ నగరాలతో హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్తంగా పోటీపడుతోందన్నారు. హెచ్సీవీబీ ద్వారా రాష్ట్రంలో పర్యాటకుల సౌలభ్యం కోసం పర్యాటక ప్రదేశాలు, హోటల్ సమాచారాలు, కన్వెన్షన్ ఫెసిలిటీస్, లాడ్జింగ్, డైనింగ్, సిటీ అట్రాక్షన్స్, ఈవెంట్స్ , మ్యూజియంలు, ఆర్ట్స్ అండ్ కల్చర్ ,హిస్టరీ అండ్ రిక్రియేషన్ లపై మ్యాప్స్ , బ్రోచర్స్, విజిటర్స్ గైడ్స్, సావనీర్లను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో తెలంగాణ పర్యాటక,సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హెచ్సీవీబీ సీఈఓ గ్యారీ ఖాన్, తాజ్ హోటల్స్ ఏరియా డైరెక్టర్ పంకజ్ సంపత్, నోవాటెల్ జీఎం రూబిన్ చెన్యాల్ పాల్గొన్నారు.


Advertisement

Next Story

Most Viewed