- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Assembly Session: అసెంబ్లీ సెషన్ పొడగింపుపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 31 లోపు తప్పని సరిగా బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించాల్సి ఉన్నదని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ పనిదినాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని వివరించారు. అవసరమైతే అలాంటి నిర్ణయం కూడా తీసుకునే ఛాన్స్ ఉన్నదన్నారు. మూడు రోజుల్లో బడ్జెట్ పైన పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సి ఉన్నదన్నారు. అన్నీ తెలిసి కూడా హరీష్ రావు ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఒక రోజు ముందే ఖరారవుతుందన్నారు. పది రోజుల ముందు అసెంబ్లీ ఎజెండాను ఇవ్వరనే విషయం హరీష్ రావుకు కూడా తెలుసునని వెల్లడించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను ఏడెనిమిది రోజులకు మించి నిర్వహించలేదని గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్‌కు రెండు నెలల ముందే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పటికి అప్పటి ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు తగిన సమయం ఇవ్వలేదన్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ మూడు రోజులు మాత్రమే బడ్జెట్ డిమాండ్లపై చర్చించిందన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో అనేక హామీలు నెరవేర్చిందన్నారు. ఖజానాను గాడిలో పెట్టి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాలకు ఇంకా సమయం కావాలంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 30 రోజుల వరకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించేదని స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీ సాంప్రదాయాలను పట్టించుకోలేదన్నారు.