- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Minister Seethakka : అనాధ విద్యార్థులతో BBQ రెస్టారెంట్లో డిన్నర్ చేసిన మంత్రి సీతక్క

దిశ, వెబ్ డెస్క్ : సంపాదించిన సంపాదనలో కొంత సమాజ శ్రేయస్సుకోసం వినియోగించాలని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. చిన్నప్పుడే పిల్లల్లో సేవ భావం పెంపొందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉందని అభిప్రాయపడ్డారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు పెద్దలపట్ల, సమాజం పట్ల ఎలా నడుచుకోవాలి అనే అంశాలను నేర్పించాలని హితవు పలికారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఏఎస్ఎఫ్ బీబీక్యూ అండ్ గ్రిల్ రెస్టారెంట్ లో ఏర్పాటుచేసిన విందు కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల(Orphan Students)తో కలిసి కాసేపు సరదాగా గడిపారు. వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విందు కార్యక్రమంలో మంత్రి చిన్నారులతో ముచ్చటించి వారిలో ఆనందాన్ని నింపారు. సామాజిక బాధ్యతగా చిన్నారులకు మంచి రుచికరమైన నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సంస్థ నిర్వాహకులు కాడ అఖిల్ అండ్ ఆరిఫ్ అలీ అన్నారు. చిన్నారుల్లో ఆనందం నింపడమే 'వన్ ఈవెనింగ్ ఆఫ్ టుగెదర్ అండ్ జాయ్'(One evening of together and joy) కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ఎన్జీవో కు చెందిన 70 మంది చిన్నారులకు ఆహార అందించడం ఆనందంగా ఉందన్నారు.