Minister Seethakka: పార్టీలో ఉన్నావో.. లేదో డిసైడ్ చేస్కో: తీన్మార్ మల్లన్నపై మంత్రి సీతక్క ఫైర్

by Shiva |
Minister Seethakka: పార్టీలో ఉన్నావో.. లేదో డిసైడ్ చేస్కో: తీన్మార్ మల్లన్నపై మంత్రి సీతక్క ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కులగణన (Cast Census) నివేదికపై మంగళవారం అసెంబ్లీ (Assembly)లో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ కొనసాగింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ (Congress MLC) తీన్మార్ మల్లన్న అలియాస్ (Teenmar Mallanna) చింతపండు నవీన్ కులగణన నివేదిక తప్పులతడక అని కాల్చేయాలంటూ పిలునిచ్చారని సభకు దృష్టి తీసుకొచ్చారు. అదేవిధంగా మరోవైపు తీన్మార్ మల్లన్న కులగణన రిపోర్టును కాల్చేసిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతోంది. తాజా పరిణామాలపై మంత్రి సీతక్క (Minister Seethakka) ఘాటుగా స్పందించారు.

కులగణన (Cast Census) నివేదికకు నిప్పు పెట్టడం దారుణమైన విషయమని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ గెలుపు కోసం తాము ఎంతగానో కష్ట పడ్డామని గుర్తు చేశారు. నవీన్ కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో ఉన్నారో.. లేదో ఆయనే డిసైడ్ చేసుకోవాలని కామెంట్ చేశారు. అదేవిధంగా కులగణనలో తప్పులు జరిగాయంటూ అసెంబ్లీ (Assembly)లో ఆరోపణలు గుప్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav), పద్మారావు (Padma Rao)లు కులగణన సర్వేలో పాల్గొనలేదని ఆరోపించారు. సర్వేలో భాగస్వాములు కాని వారికి కులగణనపై మాట్లాడే నైతిక అర్హత లేదని ఫైర్ అయ్యారు. దేశంలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కులగణన చేసి చరిత్ర సృష్టించిందని, ఇది భారతదేశానికి దిక్సూచి అని మంత్రి సీతక్క అన్నారు.

Next Story