దీపావళికి ముందే వాళ్ల పని ఖతం.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-25 11:02:55.0  )
దీపావళికి ముందే వాళ్ల పని ఖతం.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సియోల్‌ పర్యటన నుంచి తాము రాగానే తెలంగాణలో కొన్ని పొలిటికల్ బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. నవబంర్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అందరూ లోపలికి వెళతారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని.. ఎవరినీ వదిలిపెట్టబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Minister Seethakka) స్పందించారు. శుక్రవారం ఆమె ఓ మీడియా చానల్‌ ప్రతినిధితో మాట్లాడారు. నవంబర్‌లో కీలక నేతలు తప్పకుండా లోపలికి వెళ్తారని అన్నారు.

ల్యాండ్ కబ్జా, ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) చేసిన ఎవరినీ వదిలిపెట్టబోమని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్‌(Phone Tapping)తో అనేకమంది జీవితాలు ఆగం అయ్యాయని అన్నారు. దీపావళి(Diwali) పండుగకు ముందే ఈ బాంబులు పేలుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. పొంగులేటి వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా స్పందించారు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో బాంబు అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద జరిగిన ఈడీ రైడ్ మీద ఏమన్న చెబుతాడేమో?, ఈడీ దాడుల్లో ఎన్ని నోట్ల కట్టలు దొరికాయి. ఎన్ని కట్టల పాములు దొరికినయన్నది చెబుతాడా?’ అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. కేటీఆర్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు సైతం స్ట్రాంగ్‌ కౌంటర్లు ఇస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed