- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Seethakka: బీఆర్ఎస్ రైతు బేడీల నిరసనపై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) బీఆర్ఎస్ నేతల నిరసనపై మంత్రి సీతక్క (Seethakka) హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో సీతక్క మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారు తప్ప కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదన్నారు. మాజీ మంత్రులు (KTR) కేటీఆర్, హరీశ్ రావు (Harish Rao) దొరతనం మరోసారి బయటపడిందన్నారు. నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదని విమర్శించారు. నిరసనల్లో కూడా తమ దురహంకారాన్ని ప్రదర్శించారని కీలక వ్యాఖ్యలు చేశారు.
మీరు రైతులకు కనీసం పది సార్లు బేడీలు వేశారు
రైతులకు బేడీలు వేయడంపై (BRS) బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ హయాంలో రైతులకు కనీసం పది సార్లు బేడీలు వేశారని, కనీసం అప్పుడు అధికారుల మీద చర్యలు లేవని సీరియస్ అయ్యారు. మరోవైపు రైతులకు బేడీలు వేసిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయి చర్యలు కూడా తీసుకున్నారని తెలిపారు. సభలో వాళ్ళు పెట్టిన రూల్స్‌పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటి? అని ప్రశ్నించారు. గతంలో వెల్‌లోకి వస్తే సభ నుంచి సస్పెండ్ చేసేవారని, కానీ ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే వాళ్లు కాలరాస్తున్నారని ఆగ్రహించారు.