- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Minister Seethakka: మల్లన్న మాట్లాడే ముందు ఆలోచించుకో.. మంత్రి సీతక్క సెన్సేషనల్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల (EWS Reservations)ను కాపాడుకునేందుకు సమగ్ర సర్వేలో బీసీ (BC)ల లెక్కను తగ్గించి తూతూమంత్రంగా సర్వే చేపట్టారని అదే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎత్తుగడ అని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ (Chinthapandu Naveen) సంచలన వాఖ్యలు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన కులగణన (Cast Census) సర్వే తప్పులతడక అని నిరూపిస్తానని ఆయన సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్క (Minister Seethakka) కౌంటర్ ఇచ్చారు. మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.
తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) వెనుక బీసీలు ఎవరూ లేరని.. కొందరు బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) గొంతుకులే ఆయనతో మాట్లాడిస్తున్నారని కామెంట్ చేశారు. దేశం మొట్టమొదటిసారిగా ఏ ప్రభుత్వం చేయని కులగణను చేపట్టామని.. ఈ విషయంలో తమను అభినందిచాల్సింది పోయి విమర్శలు చేయడం సమంజసం కాదని అన్నారు. కార్యకర్తల శ్రమతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని తాను చేసి చూపించామని అన్నారు. ఇప్పటికైనా కులగణనపై అభ్యంతరాలు ఉంటే.. మండలిలో మాట్లాడొచ్చని.. కులగణనకు 50 రోజల సమమం ఇచ్చామని తెలిపారు. అదేవిధంగా రాహుల్ గాంధీతో పోల్చుకునే స్థాయి మల్లన్నకు లేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు.