సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిన సీతక్క

by Gantepaka Srikanth |
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిన సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రోడ్లకు రూ.1,377.66 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ తగిన ఉత్తర్వులు జారీ చేసింది. 92 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి.. మొత్తం 641 పనులకు తెలంగాణ ప్రభుత్వం రూ.1,377.66 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో 1323.86 కిలోమీటర్ల మేర నూతన రహదారుల నిర్మాణానికి ఈ నిధుల మంజూరు చేస్తున్నట్టు వివరించింది.

అయితే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా, గ్రామీణ రోడ్లకు పలు ప్రయత్నాలు చేసి, మంత్రి నిధులు సాధించినట్టు పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. కాగా, ఇంతటి కష్ట కాలంలో కూడా తమ శాఖకు నిధులు విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఆర్ఆర్ రోడ్ల కోసం రెండు, మూడు రోజుల్లో మరో 400 కోట్ల మేర నిధులు మంజూరు చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది.

Next Story

Most Viewed