చిన్నారి దుర్గకు అండగా ఉంటా : మంత్రి సీతక్క

by M.Rajitha |
చిన్నారి దుర్గకు అండగా ఉంటా : మంత్రి సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్ : నిర్మల్ జిల్లాలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారి దుర్గాకు అండగా ఉండేందుకు మంత్రి సీతక్క ముందుకు వచ్చారు. తల్లి మరణంతో ఒంటరైన దుర్గకు అన్నివిధాల తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగా రూ.50 వేలు, పార్టీ నుండి రూ.50 వేలు తక్షణ సహాయం కింద దుర్గాకు అందజేశారు. భవిష్యత్తులో తనకు సంబంధించిన అన్ని ఖర్చులు తాను భరిస్తానని, ఎవరూ లేరని బెంగపడవద్దని, తాను అమ్మలా తోడుంటానని దైర్యం చెప్పారు. కాగా తల్లి మరణించడంతో అంత్యక్రియలకు డబ్బులు లేక బిక్షాటన చేసిన దుర్గ దీనస్థితిపై పలువురు దాతలు, రాష్ట్ర మంత్రులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి కోమటిరెడ్డి 'ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్' కింద లక్ష రూపాయల సహాయం అందించడంతో పాటు భవిష్యత్తులో దుర్గ చదువుకు అయ్యే అన్ని ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చారు.

Next Story

Most Viewed