- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో బూతులను అధికారిక భాషగా మార్చిందే కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బూతులను అధికారిక భాషగా మార్చిందే కేసీఆర్ అని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో బూతులకు ఆద్యుడు అంటే కేసీఆరే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వారు దురహంకార భాషను వీడటం లేదని విమర్శించారు. ఇంకా అలాంటి భాషనే వాడుతున్నారని సీరియస్ అయ్యారు. టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రంలో ఎవరి ఫోన్ ట్యాపింగ్‌కు గురి కాలేదని కేసీఆర్ అన్నారు.. ఒకరిద్దిరి ఫోన్లు జరిగితే జరిగుండొచ్చు అని కేటీఆర్ మాట్లాడారని ఎద్దేవా చేశారు. త్వరలోనే ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అందరి పేర్లు బయటకు వస్తాయి అని అన్నారు. అధికారం కోసం బీఆర్ఎస్ నేతలు ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు.
ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌కు మరోసారి షాక్ తప్పదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్‌కు తగిన బుద్ధి చెబుతారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఒక్క సీటైనా గెలుచుకునేందుకు బీఆర్ఎస్ నేతలు నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తామని చెప్పగలిగే నియోజకవర్గం ఒక్కటి కూడా లేదంటే పరిస్థితి ఎలా తారుమారు అయ్యాయో చూసుకోవాలని హితవు పలికారు. అహంకారం పెరిగిన నేతలను ప్రజలు పక్కన పెట్టడం రాజకీయాల్లో కామన్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లకు పైగా గెలుచుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు.