Minister Seethakka: గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నం తాకట్టు ట్వీట్‌పై మంత్రి సీత‌క్క ఫైర్

by Gantepaka Srikanth |
Minister Seethakka: గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నం తాకట్టు ట్వీట్‌పై మంత్రి సీత‌క్క ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జగిత్యాల జిల్లా తొంబరావుపేట గ్రామంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సంబంధించి రూ.17 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నట్లుగా ఒక పత్రికలో కథనం రావటం, దాన్ని క‌నీసం చెక్ చేసుకోకుండానే మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ట్వీట్ చేయడం విచిత్రంగా ఉన్నదని మంత్రి సీతక్క(Minister Seethakka) ఫైర్ అయ్యారు. నిత్యం మీడియా, సోష‌ల్ మీడియాలో ఉండేందుకు పాకులాడుతూ..త‌ప్పుడు ప్రచారం చేయ‌డాన్నే హ‌రీష్ రావు ప‌నిగా పెట్టుకున్నార‌ని ఆమె శనివారం ఓ ప్రకటనలో మండిప‌డ్డారు. లేని అంశాలులున్నట్లు భ్రమింప చేయ‌డాన్ని హ‌రీష్ రావు మానుకోవాల‌ని సూచించారు.

అవాస్తవాలను ప్రచారం చేసి అధికారంలోకి వ‌చ్చేందుకు హ‌రీష్(Harish Rao) ఆరాట ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. ఇదిలా ఉండగా, గత నెల 19 నే మాజీ స‌ర్పంచ్ మామిడి స‌త్తమ్మకు రూ.7,46,787 చెక్‌ల‌కు ఇవ్వగా, అక్టోబ‌ర్ 23న మాజీ సర్పంచ్ డ‌బ్బులు విత్ డ్రా చేసుకున్నట్లు అధికారులు మంత్రి సీత‌క్క(Minister Seethakka) దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తి కాలేదని... ప్లాస్టరింగ్ పనులు పెండింగ్ లో ఉన్నాయ‌ని.. పనులు పూర్తి చేసిన తర్వాత బిల్లులు స‌మ‌ర్పించాల‌ని మాజీ స‌ర్పంచ్‌కు అధికారులు సూచించగా..ఇప్పటి వ‌ర‌కు బిల్లులు స‌మ‌ర్పించ‌లేద‌ని జిల్లా అధికారులు మంత్రికి నివేదిక సమ‌ర్పించారు.

Advertisement

Next Story

Most Viewed