మా మీద కోపంతో వాళ్లను రెచ్చగొట్టకండి.. కేటీఆర్‌కు సీతక్క హితవు

by GSrikanth |
మా మీద కోపంతో వాళ్లను రెచ్చగొట్టకండి.. కేటీఆర్‌కు సీతక్క హితవు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి సీతక్క సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని కేటీఆర్ భరించలేకపోతున్నారని సీతక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న కోపంతో అనవసరంగా ఆటో కార్మికులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ఓడిపోయిన అసహనంలో రెండు నెలలు కూడా ఓపిక పట్టకుండా కొత్త ప్రభుత్వంపై మొదటిరోజు నుంచి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2014 కు ముందు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను పదేళ్లుగా ఇష్టానుసారం దోచుకొని అప్పుల కుప్పగా మార్చారని సీరియస్ అయ్యారు. పదేళ్లలో అర్హులైన పేదలకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదని, లబ్దిదారులకు దళితబంధు, బీసీ బంధులు ఇవ్వలేదని.. సంక్షేమ పథకాలన్నీ బీఆర్ఎస్ శ్రేణులకే ఇచ్చుకున్నారని తెలిపారు. ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తుంటే తట్టుకోలేక ప్రజలను రెచ్చగొడుతున్నారని సీరియస్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లీడర్లను వదిలిపెట్టబోమని.. అవినీతికి పాల్పడిన అందరి బాగోతాలు వెలికి తీస్తామని అన్నారు.

Advertisement

Next Story