రాష్ట్ర చిహ్నాంలో కాకతీయ కళాతోరణం తొలగింపుపై మంత్రి సీతక్క క్లారిటీ

by Satheesh |   ( Updated:2024-06-03 12:13:29.0  )
రాష్ట్ర చిహ్నాంలో కాకతీయ కళాతోరణం తొలగింపుపై మంత్రి సీతక్క క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర అధికారిక చిహ్నాంలో మార్పులు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. స్టేట్ అఫిషియల్ లోగోలో ప్రస్తుతం ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించాలనుకుంటున్న ప్రభుత్వం నిర్ణయంపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ భగ్గుమంటుంది. కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు సైతం చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంబ్లమ్‌లో చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించొద్దని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర అధికారిక చిహ్నాంలో మార్పులపై మంత్రి సీతక్క స్పందించారు.

సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర చిహ్నాంలో కాకతీయ కళాతోరణం తొలగింపుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకముందే విపక్షాలు అప్పుడే ఆందోళన చేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు రాష్ట్రం గీతాన్ని కూడా వివాదస్పదం చేయడం తగదని చురకలంటించారు. ఇక, తెలంగాణలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలుస్తోందన్న విశ్వాసం ఉందని ఈ సందర్భంగా మంత్రి సీతక్క ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed