కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహం: మంత్రి సత్యవతి

by GSrikanth |
కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహం: మంత్రి సత్యవతి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కిషన్ రెడ్డి చేసిందేమీ లేదని మండిపడ్డారు. కిషన్ రెడ్డి ఒక ఉత్సవ విగ్రహం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తోందని అన్నారు. గిరిజన రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి స్థాయిలో ఉండి కూడా కిషన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జనం రోడ్లమీదకు రాకముందే కేంద్రం స్పందించాలని కోరారు.

Advertisement

Next Story