- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'దిశ' దినపత్రికపై మంత్రి పువ్వాడ ప్రశంసల జల్లు (వీడియో)
దిశ, రఘునాథపాలెం: 'దిశ' దినపత్రికపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. ఎప్పటికప్పుడు ప్రజలకు వార్తలు అందించటంలో ముందు వరుసలో ఉండటమే కాకుండా.. మంచిని.. మంచిగా.. చెడును చెడుగా అందిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందని కొనియాడారు. వేలాది మంది పాల్గొన్న బహిరంగ సభలో మంత్రి అజయ్ కుమార్ 'దిశ' పత్రికపై పొగడ్తల వర్షం కురిపించారు. సోమవారం రఘునాథపాలెం కేంద్రంలో రెవెన్యూ, పోలీస్ కార్యాలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. సోమవారం దిశ దినపత్రికలో రఘునాథపాలెంకు అత్యాధునిక హంగులు, నూతన మండలం అయినప్పటికీ అభివృద్ధిలో ఆదర్శం అనే కథనం ప్రచురితమైంది. దీంతో సమావేశం ప్రారంభంలోనే 'దిశ' పత్రికలో వచ్చిన కథనం అక్షరాల నిజమని చెప్పారు. రఘునాథపాలెం గతంలో అర్బన్ పరిధిలో ఉండటంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని పేర్కొన్నారు. తాను గెలిచాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నూతన మండలాన్ని రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టానని గుర్తుచేశారు. తనకు వచ్చే నిధులు మొత్తం రఘునాథపాలానికే కేటాయించి అభివృద్ధి చేసి చూపించానని అన్నారు. రఘునాథపాలెం రోడ్లు. పార్కులే కాదు. అత్యాధునిక అగ్రి హబ్‌గా మార్చమన్నారు. ఈ క్రమంలో తాను చేసిన అభివృద్ధిని 'దిశ' దినపత్రిక ద్వారా వేలాది మందికి చేరువైందని, 'దిశ' దినపత్రికకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.