రాష్ట్రమంతా ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి పువ్వాడ

by GSrikanth |
రాష్ట్రమంతా ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి పువ్వాడ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్​ బస్సులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ బస్సులను కూడా తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు. రవాణా శాఖలో అందిస్తున్న పౌర సేవలు, ఆన్​లైన్ సేవలు.. ఆర్టీసీ ఆదాయ, వ్యయాలపై అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రవాణా శాఖలో ఆన్​లైన్ సేవలను మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. ఈవీ వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఎలక్ట్రానిక్​ బస్సులను మరింత పెంచాలన్నారు. రవాణా శాఖలో మరికొన్ని సేవలను ఆన్​లైన్ ద్వారా అందించేందుకు సాధ్యమయ్యే అవకాశాలను పరిశీలించాలని, ఇప్పటికే చాలా వరకు సేవలను అందిస్తున్నామన్నారు. ఆర్టీసీ రోజువారి ఆదాయ, వ్యయాలపై అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేకంగా చర్చించారు. ప్రైవేట్ వాహనాలపై నిఘా పెంచాలని, పన్ను ఎగవేసే వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అయితే, శాఖలో కొన్ని ఖాళీలున్నాయని, దీంతో పనిభారం పెరుగుతుందని, పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించలేకపోతున్నామని అధికారులు వివరించారు. ఇటీవల నోటిఫికేషన్లు ఇచ్చామని, ఏఎంవీఐలకు పదోన్నతులు ఇచ్చి, ఎంవీఐ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పువ్వాడ వివరించారు. కాగా, రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్​ కుమార్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed