‘గడువులోగా BRS భవన నిర్మాణం పూర్తి కావాలి’

by GSrikanth |
‘గడువులోగా BRS భవన నిర్మాణం పూర్తి కావాలి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిర్ణీత గడువులోగా బీఆర్ఎస్ భవన నిర్మాణం పూర్తి కావాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వర్క్ ఏజెన్సీని అదేశించారు. ఆదివారం ఢిల్లీ వసంత్ విహార్‌లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయ తుది దశ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రణాళిక ప్రకారం భవన నిర్మాణ పనులు పూర్తిచేయాలని, నాణ్యతతో చేపట్టాలన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించుకొని పనుల్లో వేగం పెంచాలని ఏజెన్సీకి సూచించారు. ఆయన వెంట ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story