Ponnam : మమ్మల్ని వెనుకుండి నడిపించిన కాకా.. మంత్రి పొన్నం ఆసక్తికర కామెంట్స్

by Ramesh N |
Ponnam : మమ్మల్ని వెనుకుండి నడిపించిన కాకా.. మంత్రి పొన్నం ఆసక్తికర కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకట్ స్వామి 95 వ జయంతి వేడుకలకు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకట స్వామి (కాకా) విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మేల్యేలు వివేక్ , వినోద్‌లు నివాళులు అర్పించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా మంత్రి పొన్నం పంచుకున్నారు. రాజకీయాల్లో నైతిక విలువలను, ప్రజాస్వామ్య విలువలను ఏ విధంగా పరిష్కరించరించలేని అంశాలను కూడా అవలీలగా అధిగమించిన నేత వెంకట్ స్వామి అని కొనియాడారు.

ఎన్ఎస్‌యూఐ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని వెనుకుండి నడిపించారన్నారన్నారు. సహకార సంఘాల్లో కూడా మాకు అండగా నిలిచారన్నారు. కాకా ఆలోచనలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. బలహీన వర్గాలను న్యాయం జరగడానికి వారి గొంతుగా మేమంతా ముందుకు పోతున్నామన్నారు. కాకా వారసులు వివేక్, వినోద్ రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేర్చారన్నారు. వెంకట్ స్వామి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed