- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Minister Ponnam: ఇందిరమ్మ ఇళ్లలో ఫస్ట్ ప్రియారిటీ వాళ్లకే.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses)పై మరోసారి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్ (Hyderabad)లోని జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయంలో అధికారులు, లోకల్ ఎమ్మెల్యేలే, ఎమ్మెల్సీలు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses)కు లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) ప్రక్రియపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల జారీకి ఈ నెల 16 నుంచి 20 వరకు క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల పరిశీలన ప్రక్రియ ఉంటుందన్నారు.
ఈ నెల 21 నుంచి అర్హులైన వారి వివరాలను డేటా ఎంట్రీ చేస్తామని తెలిపారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని అన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా త్వరలోనే దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో స్థలం ఉండి ఇళ్లు లేని వారికి ఫస్ట్ ప్రియారిటీ (First Priority) ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి నిరుపేదకు ఇళ్లు ఇవ్వడమే తన ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ (Hyderabad) మహా నగరానికి వలస వచ్చిన వారికి కూడా కొత్త రేషన్ కార్డులు (New Ration Cards), ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) ఇస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం (Double Bed Room) ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి త్వరలోనే లబ్ధిదారులకు కేటాయిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.