Minister Ponnam: మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక కఠిన చర్యలే: మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-10-08 09:25:26.0  )
Minister Ponnam: మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక కఠిన చర్యలే: మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. ఇవాళ సచివాలయం (Secretariat)లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సారధి వాహన్ పోర్టల్‌ (Saradhi Vahan Portal)పై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సారధి వాహన్ పోర్టల్‌‌ (Saradhi Vahan Portal)లో తెలంగాణ రాష్ట్రం కూడా భాగస్వామి అయిందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.28ను విడుదల చేసిందని అన్నారు. ఇందులో భాగంగా 12 నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ కార్యాలయాల (RTA Offices)ను కంప్యూటరైజ్డ్ చేశామని తెలిపారు. ప్రైవేటు వాహనాల వాలంటరీ స్క్రాపింగ్ పాలసీ (Voluntary scrapping policy of private vehicles)లో భాగంగా కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ట్యాక్స్ మినహాయింపును ఇస్తామని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల (Fitness Certificates) కేటాయింపు పారదర్శకంగా జరిగందుకు గాను 37 ఆటోమెటిక్ టెస్టింగ్ స్టేషన్లు (Automatic testing stations) ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి అధికారులతో సమావేశాన్ని నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తామని అన్నారు. అదేవిధంగా వాహదారులకు డ్రైవింగ్ పట్ల, డ్రైవింగ్ రూల్స్ పట్ల అవగాహన కల్పించనున్నట్లుగా పేర్కొన్నారు. ప్రధాన రహదారులపై రోడ్ సేఫ్టీపై సైనింగ్ బోర్డులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అజాగ్రత్తగా వాహనాలు నడిపిన 8 వేల మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేశారని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నళ్లపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేతే కఠిన చర్యలు ఉండలా నిబంధనలు అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Advertisement

Next Story