- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంజాన్ ఏర్పాట్లపై అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో: రంజాన్‌కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సచివాలయంలో సోమవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో రంజాన్ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. నీరు, పారిశుధ్యంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తున్న మొదటి రంజాన్‌ను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. మసీదుల వద్ద శామియానాలు, నీటి వసతి, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. మంచినీటి ట్యాంకర్లు అదనంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
ట్రాన్స్ఫార్మర్లు అదనంగా ఉంచడంతో పాటు మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదనపు శానిటేషన్ టీమ్స్‌ని ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించారు. షాపులు 24 గంటలు నడుపుకోవడాన్ని పరిశీలించాలని, పుట్ పాత్‌లపై ఉండే చిరు వ్యాపారులను ఇబ్బందులు కలిగించవద్దని హైదరాబాద్, సైబారాబాద్, రాచకొండ పోలీస్ అధికారులతో పాటు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు. రంజాన్ పండుగ నిధుల విడుదలపై సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. రంజాన్ నెలరోజులు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునే విధంగా కృషి చేయాలన్నారు.