- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయం తీసుకున్నాం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కుల గణనపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం అసెంబ్లీ వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో తాము కుల గణన చేస్తామని మాట ఇచ్చామని.. ఆ మాట ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా కుల గణనను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని.. దీనిపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. బడుగు బలహీన వర్గాలు సామాజిక, రాజకీయ, ఉద్యోగాల్లో ఎదగాలని తమ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు.
మాజీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ నిన్న బిల్లు ప్రవేశ పెట్టిన సమయంలో అనేకసార్లు సభను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారని అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాల్లో దీనిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సకల జనుల సర్వే రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు...? మీరు ఎప్పుడైనా మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్‌లో అడిగారా..? అని ప్రశ్నించారు. సభలో సలహాలు, సూచనలు ఇవ్వమంటే విమర్శలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. అనుమానాలు పక్కన పెట్టి ఇప్పటికే కుల గణన జరిపిన ఆయా రాష్ట్రాల నుంచి ఫీడ్ బ్యాక్ తెలుసుకోవాలని సూచించారు. జన గణన సర్వే 100 శాతం ప్రయోజనం జరిగే విధంగా ముందుకు పోతామని చెప్పారు.