మంత్రులను వాటితోనే సత్కరించండి.. మంత్రి పొన్నం కీలక పిలుపు

by GSrikanth |
మంత్రులను వాటితోనే సత్కరించండి.. మంత్రి పొన్నం కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలు, ప్రముఖులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పిలుపు ఇచ్చారు. చేనేత రంగాన్ని ప్రొత్సహించేందుకు అందరూ నడుం బిగించాలని కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని కాపాడండి - కాటన్‌ను ప్రోత్సహించండి అని పిలుపునిచ్చారు. అతిథులు, పెద్దలకు మర్యాద చేసేటప్పుడు కాటన్ టవల్స్‌లో సత్కరించండి అని చెప్పారు. అటు చేనేతలను ప్రోత్సహించినట్టు అవుతుంది.. ఇటు ఉపయోకరమైన కాటన్ టవల్స్ ఇచ్చిన వారు అవుతారని అన్నారు. లేదంటే పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులైనా ఇవ్వండి అని కోరారు. మంత్రులు, అధికారులు, ప్రముఖులకు కప్పే శాలువాల వలన ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. టవల్స్ కాని, పుస్తకాలు, పెన్నులు గాని ఇస్తే ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. తన వద్దకే కాదని.. ఏ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే సహా ఇతర ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్లినా ఇవే పాటించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed