కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక హామీ

by GSrikanth |
కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: మొదటి నుంచి పార్టీలో కొనసాగుతూ, పార్టీ అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక హామీ ఇచ్చారు. ఆదివారం గాంధీ భవన్‌లో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి శ్రీలత శోభన్ రెడ్డి మంచిపనిచేశారని అభినందించారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి బీఆర్ఎస్‌లో ఎప్పుడూ అవమానమే ఉంటుందని చెప్పారు. మొదటి నుంచి ఉన్నవారిని కాకుండా చివర్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అమరుల త్యాగాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని గుర్తుచేశారు. తెలంగాణ కోసం పోరాడిన వారికి కాంగ్రెస్ సమూచిత ప్రాధాన్యం ఇస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజలందరిని సంక్షేమ అభివృద్ధి వైపు నడిపించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల ఆధారంగా ఏర్పడిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవమానాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు వస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడికి సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story