- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనియా వస్తారనే ఆశిస్తున్నాం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అవతరణ, దశాబ్ధి ముగింపు వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. కాగా, ఇదే అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్బంగా పొన్నం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం ఎన్నో వర్గాల ప్రజలు పోరాటం చేశారన్నారు. తెలంగాణ వచ్చాక పదేళ్లు నియంతృత్వం కొనసాగిందన్నారు.
ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని.. అమర వీరులను స్మరించుకుంటూ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయన్నారు. వేడుకలకు రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రధాని మోడీ ఎన్నో సార్లు తెలంగాణ ఏర్పాటును అవమానించారన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీ వస్తారని ఆశిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ వేడుకలకు ఆహ్వానించలేదని.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదని గుర్తు చేశారు. రాష్ట్ర చిహ్నం రూపకల్పనలో గత ప్రభుత్వం ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదన్నారు.