Minister Ponnam: కులగణనపై మాట్లాడే హక్కు బీజేపీకి లేదు.. మంత్రి పొన్నం సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |   ( Updated:2025-03-01 08:19:13.0  )
Minister Ponnam: కులగణనపై మాట్లాడే హక్కు బీజేపీకి లేదు.. మంత్రి పొన్నం సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కులగణన (Cast Census)పై మాట్లాడే నైతిక హక్కు బీజేపీ (BJP))కి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీల్లో మేధావులు, ఇతర సంఘాల నాయకుల కోరిక మేరకు రాష్ట్రంలో మరోసారి రీ సర్వేకు ప్రభుత్వం అనుమతించిందని అన్నారు. కానీ సర్వేకు చాలా తక్కువ స్పందన వచ్చిందని అన్నారు. ఈ పరిణామం తమను తక్కువ చేసి చూపారని అనే వాళ్లకు ఓ సమాధానమని కామెంట్ చేశారు. సర్వేలో పాల్గొనని వాళ్ల కోసం మరోసారి అవకాశం ఇచ్చిన సద్వినియోగం చేసుకోకపోవడం బాధకరమని అన్నారు.

అదేవిధంగా కులగణనపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీ (BJP)కి లేదని.. పార్టీ బీసీ (BC) జనగణనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు (Supreme Court)లో అఫిడవిట్ ఇచ్చిందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే తప్పులు ఉన్నాయంటూ కామెంట్ చేసిన కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao)లు మరోసారి సర్వేలో వివరాలు ఇవ్వలేదని.. ఇదేం పద్ధతి అంటూ మంత్రి పొన్నం మండిపడ్డారు. అదేవిధంగా రాష్ట్రంలో గత పదేళ్లలో ఆర్థిక విధ్వంస జరిగిందని అన్నారు. ప్రస్తుత్వం ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని.. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతోన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే (Comprehensive Survey)లో పాల్గొనని కుటుంబాల వివరాలను సేకరించేందుకు చేపట్టిన కులగణన రీ సర్వే శుక్రవారంతో ముగిసింది. అయితే, నవంబరు 6 నుంచి డిసెంబరు 25 వరకు నిర్వహించిన సమగ్ర సర్వేలో తప్పులు దొర్లాయని ప్రజలు, రాజకీయ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తెలంగాణ సర్కార్ (Telangana Government) ఈనెల ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రీ సర్వేకు అవకాశం కల్పించింది.

Next Story

Most Viewed