- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త రేషన్ కార్డులపై మరోసారి మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అర్హులైన రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తామని వెల్లడించారు. ఈ విషయాన్ని మంత్రి ఎక్స్(ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.
తెలంగాణ ఏర్పడి పదేళ్లు అవుతున్నా రేషన్ కార్డులు మాత్రం లబ్ధిదారులకు జారీ చేయలేదు. సంక్షేమ పథకాలు లబ్ధిదారుడికి చేరాలంటే రేషన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్‌కార్డు జారీ చేయకుండా నిర్లక్ష్యం చేసింది. దీంతో సంక్షేమ పథకాలు అందుకునే వారు అనేక ఇబ్బందులు పడ్డారని అసహనం వ్యక్తం చేశారు. ఈ రేషన్ కార్డు ఉంటేనే పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, ఆరు గ్యారంటీలకు అర్హులు. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ప్రభుత్వం రేషన్‌కార్డులను జారీ చేయడానికి ముందుకొచ్చింది. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు రేషన్‌కార్డు లేక చాలా పేద, మధ్య తరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడ్డాయి. ఆ బాధలను తీర్చడానికి కొత్త రేషన్ కార్డులను జారీ చేసి వారికి కానుకగా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది.