Ponguleti Srinivas: కనీసం తీసుకున్న జీతం మందం అయినా పని చేయండి.. అధికారులపై పొంగులేటి సీరియస్

by Prasad Jukanti |
Ponguleti Srinivas: కనీసం తీసుకున్న జీతం మందం అయినా పని చేయండి.. అధికారులపై పొంగులేటి సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జెన్ కో అధికారుల తీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మీరు తీసుకున్న జీతం మందం అయినా పని చేయాండి అంటూ మందలించారు. పాలేరు రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన మంత్రి.. పవర్ ప్లాంట్ ను రెడీ చేయకపోవడంపై సీరియస్ అయ్యారు. నీరు వస్తుందని తెలిసినా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని అధికారులను నిలదీశారు. మీ నిర్లక్ష్యం కారణంగా ప్రజల సంపదను వృథా చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి బాధ్యులైన ఉన్నతాధికారులకు ఫోన్ లోనే వార్నింగ్ ఇచ్చారు.

ప్రజల కోరికను వరుణ దేవుడు మన్నించాడు..

గత 2 సవంత్సరాలుగా నీరు లేక విలవిలలాడిన దిగువ ఆయకట్టు రైతులకు పాలేరు పెద్ద కాలువ ద్వారా నీరు విడుదల చేయడం చాలా సంతోషకరంగా ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. నాగార్జున సాగర్ కింద ఉన్న సుమారు 2 లక్షల 75 వేల ఎకరాల ఆయకట్టుకు కృష్ణానీటిని విడుదల చేశామన్నారు. సుమారు 37 మండలాల్లో తెలంగాణతో పాటు ఏపీ ప్రాంతానికి వెళ్తాయన్నారు. గత రెండేళ్లుగా కృష్ణా బేసిన్ లో నీరు లేక రైతులకు నీళ్లు ఇవ్వలేకపోయారని కానీ తెలంగాణ ప్రజలు రాజకీయ మార్పుతో పాటు వాతావరణంలో మార్పు రావాలని కోరుకున్నారన్నారు. ప్రజల కోరికను మన్నించిన వరుణ దేవుడు ఆశీర్వదించాడని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో సమృద్ధిగా శ్రీశైలం, నాగార్జున సాగర్ తో పాటు ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed