Minister Ponguleti: జిల్లాల రద్దుపై మండలిలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

by Shiva |
Minister Ponguleti: జిల్లాల రద్దుపై మండలిలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కొలువుదీరాక రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కుదిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ శాసన మండలిలో ఓ సభ్యుడు జిల్లాల కుదింపుపై ప్రశ్న వేయగా.. అందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) సమాధానమిచ్చారు. తెలంగాణ (Telangana)లో ఏ జిల్లాను ప్రభుత్వం రద్దు చేయబోదని ప్రకటించారు. పాత జిల్లాలను రద్దు చేయాలన్న ఆలోచన తమకు ఏమాత్రం లేదని అన్నారు. పదేళ్లు అధికారంలో బీఆర్ఎస్ (BRS) మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఫైర్ అయ్యారు. నేడు ఆ అప్పులను తీరుస్తునే.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం వద్దకు నిధుల కోసం తరచుగా వెళ్తాయని.. వెళ్లిన ప్రతిసారీ నిధులు రావని అన్నారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ఎన్ని నిధులు వచ్చాయో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కార్ (Congress Government) పేదల ప్రభుత్వమని.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే తమ ధ్యేయమని మంత్రి పొంగులేటి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed