బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్

by Mahesh |   ( Updated:2024-08-23 11:30:00.0  )
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సవాల్ విసిరారు. "తన ఇల్లు బఫర్ జోన్‌లో ఉన్నట్లు.. కేటీఆర్‌, హరీష్‌రావు నిరూపించాలని సవాల్ విసిరారు. అలాగే తన ఇంట్లో ఒక్క ఇటుక బఫర్ జోన్‌లో ఉన్నా కూలగొట్టాలని సూచించారు. సామాన్యుల కోసమే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. కాగా నగర వ్యాప్తంగా హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ పై హైడ్రా దృష్టి సారించింది. దీంతో ఆ ఫామ్ హౌస్ మాజీ మంత్రి కేటీఆర్ ఉంటున్నది కావడంతో వార్తల్లోకి ఎక్కింది. ఇదే విషయంపై కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని.. తన ఫ్రెండ్ ది కావడంతో తాను లీజ్‌కు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. అలాగే అక్రమ కట్టడాల పేరుతో కేవలం ప్రతిపక్షాలకు చెందిన కట్టడాలనే హైడ్రా కూల్చి వేస్తుందని.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటితో పాటు ఇతర మంత్రులు కూడా అక్రమంగా ఫామ్ హౌస్‌లను కట్టుకున్నారని.. వాటిని కూడా కూల్చాలని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు.

Advertisement

Next Story