- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయ సన్యాసం స్వీకరిస్తా.. బండి సంజయ్‌కు Minister Mallareddy సవాల్!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య రాజకీయం హాట్ హాట్ గా సాగుతున్న వేళ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కు మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనైనా ఉన్నాయో బండి సంజయ్ చూపించాలని అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ తరహా పథకాలు చూపిస్తే తన మంత్ర పదవితో పాటుగా ఎమ్మెల్యే పోస్టుకు రాజీనామా చేస్తాన్నారు. అంతే కాదు రాజకీయ సన్యాసం కూడా స్వీకరిస్తానని ఛాలెంజ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన బండి సంజయ్ మా సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, ఏ రాష్ట్రానికి రమ్మంటే ఆ రాష్ట్రానికి వస్తానని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 12,700 గ్రామాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దన్నారు. దేశంలో 19 రాష్ట్రాలు బీజేపీ పరిపాలిస్తుందని ఆ రాష్ట్రాల్లో రైతులకు ఉచిత కరెంట్, రైతు బంధు, తాగునీరు, సాగునీరు, హరితహారం వంటి తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలు అమలు అయితే చెప్పాలన్నారు. ఫార్మర్స్ డే నాడు తాను ఈ సవాల్ చేస్తున్నాన్నారు.