- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందు తాగితే తప్పేంటి.. మద్యం ఫొటోలపై మల్లారెడ్డి క్లారిటీ
దిశ, కంటోన్మెంట్/బోయిన్‌పల్లి: బంధువుల ఇంట్లో మద్యం తాగితే తప్పా? అని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి తనకు అప్పగించిన గ్రామాల్లో ప్రచారం పూర్తి చేసుకున్న అనంతరం తన బంధువుల ఇంట్లో విందులో పాల్గొన్నానని తెలిపారు. బీజేపీ నాయకుల సహకారంతో కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. కాగా, ఆదివారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మంత్రి తన బావలు, సోదరులతో విందులో పాల్గొని, వారికి మద్యం పోస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. వారి విమర్శలకు మంత్రి మల్లారెడ్డి సోమవారం స్పందించారు. తానేదో చేయకూడని పని చేసినట్లు అనవసర రాద్దాంతం చేస్తున్నారని, ఇందులో బీజేపీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తాను మంత్రి అయిన తర్వాత మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉండే తమ బంధువులు అనేకసార్లు ఆహ్వానించడం జరిగిందని తెలిపారు.
అయితే అక్కడికి ప్రచారానికి వెళ్లిన సందర్భంలో ప్రచారం ముగించుకున్న తర్వాత బంధువులతో కలిసి వారి ఇంట్లో విందులో పాల్గొన్న మాట వాస్తవమేనని తెలిపారు. అప్పటివరకు తాను మందు కూడా సేవించలేదని వివరణ ఇచ్చారు. ఆ ఫోటోలో తన ముందు ఖాళీ ప్లేట్ ఉందన్నారు. ఇందులో తనకు తప్పేం కనబడటం లేదన్నారు. బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానడంపై ఆయన వ్యంగంగా స్పందించారు. ఈ విషయంలో అవసరమైతే సీబీఐ విచారణ చేయించుకొండని సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాయని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇదంతా గిట్టని వాళ్ళు ఆడుతున్న డ్రామా అని మల్లన్న తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.