- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై KTR కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ వార్షికోత్సవ సమావేశంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్ బేగంపేట్ ఐటీసీ కాకతీయలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. మీ నుంచి వస్తున్న స్పందన చూస్తే మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాకే అధికారం ఇవ్వాలని అన్నారు. పారిశ్రామికంగా తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నదని తమలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పని చేస్తే అద్భుతమైన అభివృద్ధి దేశం సాధించవచ్చని అన్నారు.
వ్యాపారులు, పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందన్నారు. ఇన్వెస్టర్లు ముందుకు వస్తే సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామన్నారు. ఇన్నోవేషన్స్‌ను ప్రోత్సహించడానికి టీ-వర్క్స్ ప్రారంభించామని ప్రైవేటు రంగంలో ఉపగ్రహాల తయారీ మొట్టమొదటగా హైదరాబాద్‌లోనే జరిగిందన్నారు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు హైదరాబాద్‌లోనే తమ కేంద్రాలు ఏర్పాటు చేశాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం పలు రంగాల్లో విశేష సేవలు అందించిన సంస్థలకు సీఐఐ అవార్డులు ప్రదానం చేశారు.