మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌కు వచ్చేది అప్పుడే!

by Anjali |   ( Updated:2023-05-26 12:52:54.0  )
మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌కు వచ్చేది అప్పుడే!
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవంతంగా అమెరికా పర్యటన పూర్తి చేసుకున్న తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు ఈ నెలాఖరున హైదరాబాద్‌కి రానున్నారు. ఈనెల (మే)16వ తేదీ నుంచి దాదాపు పది రోజులపాటు విస్తృతంగా పదుల సంఖ్యలో వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో సమావేశమై తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులను, ఉద్యోగాలను తీసుకువచ్చేందుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్, ఈ నాలుగు రోజులు పాటు తన కుటుంబంతో సమయం గడపనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌కి ఈ నెలాఖరున తిరిగి రానున్నారు.

Also Read...

వచ్చే నెల 4 నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన

Advertisement

Next Story