ప్రధాని మోడీని మరోసారి నిలదీసిన మంత్రి కేటీఆర్

by GSrikanth |   ( Updated:2023-07-08 12:46:46.0  )
ప్రధాని మోడీని మరోసారి నిలదీసిన మంత్రి కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీని మంత్రి కేటీఆర్ మరోసారి నిలదీశారు. నేడు తెలంగాణ పర్యటనకు రానున్న మోడీపై సోషల్ మీడియా వేదికగా మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు. విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా అమలు చేయని ప్రధాని, ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని అడిగారు. కాజీపేటకు కోచ్‌ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఒక రిపేర్‌ షాప్‌ను, వ్యాగన్‌ తయారీ యూనిట్‌ను పెట్టడం అన్యాయమని మండిపడ్డారు. ‘గుజరాత్‌లో రూ.20 వేల కోట్లతో లోకోమోటివ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ పెడతామని రైల్వేశాఖ ప్రకటిస్తే, మోడీ స్వయంగా వెళ్లి శంకుస్థాపన చేశారు. కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ హామీకి మాత్రం మంగళం పాడారు. మొత్తం రైలునే ఇక్కడ తయారు చేస్తామని నాడు చెప్పి.. ఇప్పుడేమో కేవలం రూ.521 కోట్లతో ఒక రిపేర్‌ షాప్‌ను, ఒక వ్యాగన్‌ షాప్‌ను పెట్టేందుకు వస్తున్నారు. ఒక ప్రధానమంత్రిగా, తెలంగాణకు జరుగుతున్న సెకండ్ క్లాస్ ట్రీట్‌మెంట్‌పై మీ ప్రభుత్వం బహిరంగ వివరణ ఇవ్వాలి’ అని విమర్శనాస్త్రాలు సంధంచారు.

Also Read: హకీంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోడీ

Advertisement

Next Story

Most Viewed