- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నువ్వు తెలంగాణ వాదివి కావు.. తెలంగాణకు పట్టిన వ్యాధివి: రేవంత్ పై మంత్రి కేటీఆర్ ఫైర్
దిశ, వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదని, తెలంగాణకు పట్టిన వ్యాధి అని విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ఐటీ హబ్ ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై రైఫిళ్లతో దాడికి దిగిన రేవంత్.. ఇవాళ తాను నిఖార్సైన తెలంగాణ వాది అని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.
హంతకుడే సంతాపం చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా గుడ్డి గుర్రాల పళ్లు తోమారా అని నిలదీశారు. కరెంట్, నీళ్లు ఇవ్వకుండా రైతులను చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా అని ప్రశ్నించారు. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవని, ఒక్క బీఆర్ఎస్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కేటీఆర్ అన్నారు.