మోడీకే సీబీఐపైన నమ్మకం లేదు.. దేశ ప్రజలు నమ్ముతారా?: కేటీఆర్

by GSrikanth |   ( Updated:2023-03-23 15:38:46.0  )
మోడీకే సీబీఐపైన నమ్మకం లేదు.. దేశ ప్రజలు నమ్ముతారా?: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలపై పీఎం నరేంద్రమోడీకే నమ్మకం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధానికే నమ్మకం లేనప్పుడు దేశ ప్రజలు ఎందుకు నమ్ముతారని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీల నేతల డిమాండ్లపై కేటీఆర్ పరోక్షంగా స్పందించారు. ‘సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారింది.. దేశానికి దానిపై నమ్మకం లేదు.. సీబీఐ అంటే మాకు భయం చూపవద్దని కేంద్రానికి చెబుతున్నాను’ అని 2013లో జూన్‌లో మోడీ చేసిన ట్వీట్‌ను ట్విట్టర్‌లో గురువారం ట్యాగ్ చేశారు. అలాంటి సీబీఐపై ఇప్పుడు ప్రజలకు నమ్మకం ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు.

Also Read...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు!

Advertisement

Next Story